వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పరిష్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండ శివారు తిరుమలనాథ స్వామి దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని భక్తులు దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు.