ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ ఈ సంక్రాంతి కొత్త వెలుగులు, ఆనందం నింపాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. పండుగకు ఊరెళ్లి కుటుంబ సభ్యులు, బంధువులతో సంతోషంగా సమయాన్ని గడపాలని చెప్పారు. అందుకే తాను కూడా ప్రతి ఏడాది సంక్రాంతికి తిరుపతి జిల్లాలోని తన సొంత గ్రామమైన నారావారి పల్లికి వెళ్తానని వ్యాఖ్యానించారు.