సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ఈ పరిస్థితిలో రవాణా శాఖ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన నగరాల నుంచి ప్రయాణికులను సౌకర్యవంతంగా తరలించడానికి ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల బస్సులను వినియోగించాలని సూచించారు. ఈ బస్సుల కోసం ముందస్తుగా ఫిట్నెస్ టెస్టులు నిర్వహించాలని తెలిపారు. ప్రయాణికులు ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కోకూడదని పేర్కొన్నారు.