దేశ వ్యాప్తంగా ఇటీవల కాలంలో రాహుల్ గాంధీకి వస్తున్న ప్రజా ఆదరణను చూసి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు తట్టుకోలేకపోతున్నారని సీడబ్ల్యుసీ ప్రత్యేక ఆహ్వానితులు చెల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చెల్లా మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుతం రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం జరుగుతుందన్నారు.