మహబూబ్ నగర్ జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ ఆదివారం సాయంత్రం భారత్ బెంజ్, టిప్పర్ లతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న పోలీస్, రెవిన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇసుక మాఫియాకు అధికారుల అండ దండలతో తూతూ మంత్రంగా కేసులు నమోదు చేయడంతో ఎస్పీ, కలెక్టర్ ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తున్నారన్నారు.