నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం జిల్లెల్ల గ్రామంలో శుక్రవారం డంపింగ్ యార్డ్ లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఉదయం నుండి సాయంత్రం వరకు మంటలు అదుపులోకి రాకపోవడంతో పాటు మంటలతో కూడిన పొగ వ్యాపించడంతో గ్రామం మొత్తం పొగతో నిండిపోయింది. ఫైర్ సిబ్బందికి గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.