కొల్లాపూర్ నియోజకవర్గ పరిధి, పాన్ గల్ మండల పరిధిలోని కేతేపల్లి గ్రామానికి చెందిన అర్హులైన ముగ్గురికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ. విష్ణు లబ్ధిదారులకి ఆదివారం అందజేశారు. లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి జూపల్లి కృష్ణారావుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.