మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో ఆశ వర్కర్ల నిర్వధిక సమ్మె మూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల అధ్యక్షులు విజయలక్ష్మి ,తిరుపతమ్మ
పుష్ప, లక్ష్మి మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో ప్రభుత్వం నిర్వహించే ప్రతి సర్వేలో తమ ఆశ వర్కర్లు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆశ వర్కర్లు చాలీచాలని వేతనంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. తమకు కనీస వేతనం 18000 పెంచాలన్నారు.