రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి , మహబూబ్ నగర్ బిఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థిగా వి. శ్రీనివాస్ గౌడ్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తన యొక్క స్థిర ఆస్తులు రూ. 66 లక్షలు, చరాస్తులు రూ.14 లక్షలు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. తనకు సొంత వాహనం లేదని అప్పులు రూ. 19 లక్షలు, వ్యవసాయ పొలం 4 ఎకరాలు, 10 తులాల బంగారం , నగదు రూ. 44776తో పాటు తనపై మూడు పెండింగ్ కేసులు ఉన్నాయని తెలిపారు.