హన్వాడ మండలం నాగం బాయ్ తండాకు చెందిన బాబురావు అనే వ్యక్తి మహబూబ్నగర్ నుండి తన స్వగ్రామానికి వెళుతుండగా మార్గం మధ్యలో పిల్లిగుండు వద్ద టైరు పగలడంతో ప్రమాదానికి గురయ్యాడు. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది ఈఎంటీ ఇర్ఫాన్ పైలట్ శివశంకర్ సంఘటన స్థలానికి చేరుకొని బాబురావును అంబులెన్స్ లో మహబూబ్నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. హెల్మెట్ లేకపోవడం వల్ల తలకు బలమైన దెబ్బ తగిలిందని అంబులెన్స్ సిబ్బంది తెలిపారు.