మార్కెట్ యార్డ్ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని మార్కెట్ చైర్ పర్సన్ రాధ లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మక్తల్ మార్కెట్ యార్డు కార్యాలయంలో మొదటి సర్వసభ్య సమావేశం చైర్ పర్సన్ అధ్యక్షతన నిర్వహించారు. మార్కెట్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లుగా నియమించడం పట్ల ఎమ్మెల్యే శ్రీహరి, ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మార్కెట్ యార్డులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను చర్చించారు.