రాజ్యాంగ ప్రధాత బీఆర్ అంబేద్కర్ ను అవహేళన చేస్తూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ గురువారం హైదరాబాద్ అసెంబ్లీలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. కేంద్రమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేద్కర్ పై చేసిన వాఖ్యల పట్ల అమిత్ షా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, క్యాబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.