వెల్దండ మండలంలో ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

70చూసినవారు
వెల్దండ మండలంలో ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే
వెల్దండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి డాక్టర్లు, ఆశా వర్కర్లు, సిబ్బందితో మాట్లాడారు. ఈ సీజన్లో డెంగ్యూ, మలేరియా వంటి వైరల్ ఫీవర్ రోగాల బారిన పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారికి తక్షణమే చికిత్స చేయాలని ఆదేశించారు. ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేయాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్