ఘనంగా ఎమ్మేల్యే గువ్వల పుట్టిన రోజు వేడుకలు

2020చూసినవారు
ఘనంగా ఎమ్మేల్యే గువ్వల పుట్టిన రోజు వేడుకలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కళాకారులకు గొప్ప గౌరవం దక్కిందని పద్మశ్రీ అవార్డు గ్రహీత మెట్ల కిన్నెర మొగులయ్య అన్నారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా పదర మండల కేంద్రంలోని స్థానిక వివేకానంద చౌరస్తాలో ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మేల్యే గువ్వల బాలరాజు పుట్టిన రోజు వేడుకలను తెరాస నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ పుట్టిన రోజు వేడుకలకు పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య హాజరై కేక్ కట్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కనుమరుగై పోతున్న కిన్నెర కళను ప్రోత్సహించి ఎక్కడో మారుమూల గ్రామంలో కిన్నెర వాయించికుంటు బ్రతికే నాకు తెలంగాణ రాష్ట్రంలో గొప్ప గౌరవం దక్కిందన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది కళాకారులను గుర్తించి ప్రభుత్వం వారికి ప్రతి నెల పించన్ అందజేస్తుందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కళను కళాకారులను ప్రోత్సహి్తున్నారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటిసి రాంబాబు నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వై. జగపతి రాజు, ఉపాధ్యక్షుడు దాసరి ఎల్లయ్య, మద్దిమడుగు దేవాలయ ఛైర్మెన్ విష్ణుమూర్తి, సింగిల్ విండో డైరెక్టర్ శంకర్ , ఎంపిటిసి సునీత శ్రీనివాసులు , గ్రామ అధ్యక్షుడు నారయ్య, మాజీ సర్పంచ్ రాయ శ్రీనివాసులు, నాయకులు పుణ్యమూర్తి నారాయణ, ముత్యాలు, ఎడమ వెంకటయ్య, నీలం రాజు, మహేష్, కొయ్యల వెంకటయ్య, నిరంజన్, చంద్రయ్య, తిరుపతయ్య,

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్