ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి అన్నారు. మంగళవారం మరికల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. చేరిన వారిలో పట్టణ ప్రధాన కార్యదర్శి నర్సింహులు, నాయకులు ఆంజనేయులు, బాలయ్య తదితరులు ఉన్నారు.