పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తామని, వాహనదారులు పత్రాలు అందుబాటులో పెట్టుకోవాలని ఎస్సై వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం నారాయణపేట పట్టణ శివారు ఎర్ర గుట్ట వద్ద కర్ణాటక నుండి వచ్చి, పోయే వాహనాలను తనిఖీ చేశారు. వాహనాల పత్రాలను పరిశీలించారు. నంబర్ ప్లేట్ సరిగా లేని వాహనాలపై జరిమానా వేశారు. మద్యం సేవించి వాహనాలు నడపరదాని, సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. సిబ్బంది పాల్గొన్నారు.