నారాయణపేట: పెద్దమొత్తంలో గుట్కా ప్యాకెట్ల పట్టివేత

64చూసినవారు
నారాయణపేట పట్టణంలోని సత్యసాయి కాలనీలోని పూరి శ్రీధర్ అనే వ్యక్తికి చెందిన షెడ్డులో సోమవారం భారీ మొత్తంలో గుట్కా ప్యాకెట్ల పట్టుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు చేసి రూ. 6, 80, 460 విలువ గల గుట్కా ప్యాకెట్ల గల బస్తాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. శ్రీధర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. గుట్కా నిల్వ చేస్తే సమాచారం ఇవ్వాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్