నారాయణపేట: జిల్లా స్థాయి పోటీల ఎంపికలు ప్రారంభం

63చూసినవారు
నారాయణపేట మిని స్టేడియం మైదానంలో శుక్రవారం నిర్వహించిన వాలీబాల్ జిల్లా స్థాయి పోటీల ఎంపికలను జిల్లా విద్యా శాఖ అధికారి అబ్దుల్ ఘని, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ నర్సింహులు ప్రారంభించారు. అనంతరం పోటీలను వీక్షించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని చెప్పారు. స్టేట్ లెవల్ పోటీల్లో పాల్గొని పథకాలు సాధించాలని కోరారు. కార్యక్రమంలో పిఈటీ లు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్