నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల పరిధిలోని మొగలమడక గ్రామంలో గురువారం మూడు విడతలుగా రెండు లక్షల రుణమాఫీ చేసిన సందర్భంగా ఊరి చుట్టు డప్పులతో ఊరేగింపు చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.