నారాయణపేట మండలం, సింగారం గ్రామంలో శ్రీ గిరీ పీఠంపైన కొలువైన భవానీ మాత ఆలయంలో పుష్కర బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. వనపర్తి జిల్లా, కొత్తకోట గ్రామానికి చెందిన సుదర్శన్, మంజుల దంపతులు నారాయణపేట మండలం, సింగారం గ్రామంలోని గట్టు పై 26 ఏప్రిల్ 2011 లో ఆలయం నిర్మించి, భవానీ మాత విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుంచి గ్రామస్తుల సహకారంతో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాదితో పన్నెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అమ్మవారికి పుష్కర బ్రహ్మోత్సవాలను ఆరు రోజుల పాటు జరిపారు. అందులో భాగంగా ఆఖరి రోజు అభిషేకం, పుష్పాలంకరణ నిర్వహించినారు. పూర్ణాహుతి కార్యక్రమంతో భవానీ మాత పుష్కర బ్రహ్మోత్సవాలను వైభవంగా ముగింపు పలికారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈకార్యక్రమంలో భక్తులు, మహిళలు, చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.