నారాయణపేట జిల్లా కోస్గి మండల చంద్రవంచ గ్రామంలోని ఒకటవ వార్డులో రోడ్డుపైన మురుగు నీరు అని లోకల్ యాప్ లో వార్త వచ్చిన వెంటనే సర్పంచ్ మల్లెల రఘువర్దన్ రెడ్డి, పంచాయతీ సెక్రెటరీ సునీత స్పందించారు. గురువారం ఉదయం గ్రామ పారిశుద్ధ్య సిబ్బందిని పంపించి రోడ్ల పైన మురుగు నీరు, నాచును తొలగించారు. నీటిని వృథాగా విడిచే ఇళ్లకు హెచ్చరికలు జారీ చేశారు. పంచాయతీ కార్యదర్శి సునీత దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. మరో రెండు వారాలలో డ్రైనేజీని నిర్మిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు.