ప్రజల కోసం అమలు చేసే ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నారాయణపేట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, బీజేపీ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ నందు నామాజీ అన్నారు. అనారోగ్యంతో చికిత్స పొందిన నారాయణపేట పట్టణంలోని బురుడివాడికి చెందిన జ్యోతిలక్ష్మికి శుక్రవారం రూ. 18 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారంతో డబ్బులు మంజూరు అయ్యాయని, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.