ధర్మ జాగరణ సమితి - తెలంగాణ, పాలమూరు విభాగ్ ఆధ్వర్యంలో చేపట్టిన హిందూ చైతన్య రథయాత్ర శనివారం నారాయణపేట మండలం, సింగారం గ్రామానికి చేరుకుంది. మహిళలు మంగళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. భజన కీర్తనలతో ప్రధాన రహదారుల గుండా యాత్ర నిర్వహించారు. నారాయణపేట విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు నర్సింహులు మాట్లాడుతూ హిందూ సంప్రదాయాలను, కట్టుబాట్లను పాటించాలని, సనాతన ధర్మాన్ని అనుసరించాలని అన్నారు.