Sep 21, 2024, 07:09 IST/మహబూబ్ నగర్ నియోజకవర్గం
మహబూబ్ నగర్ నియోజకవర్గం
బాలాంజనేయస్వామి దేవాలయానికి పూజ సామాగ్రి పంపిణీ
Sep 21, 2024, 07:09 IST
మహబూబ్ నగర్ పట్టణం వన్ టౌన్ చౌరస్తా సమీపంలోని శ్రీ బాలాంజనేయస్వామి దేవాలయానికి శనివారం పూజ సామాగ్రిని పంపిణీ చేసినట్లు నేను సైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా పురాతన దేవాలయాలకు పూజా సామాగ్రిని పంపిణీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నేను సైతం స్వచ్ఛంద సంస్థ సభ్యులు రెయిన్ బో శ్రీనివాస్,
రఘురాం గౌడ్, శ్రీధర్, పూజరి వెంకట్, తదితరులు పాల్గొన్నారు.