మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చి బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం‘RC16’. ఈ మూవీకి సంబంధించి టీం ఓ అప్ డేట్ ఇచ్చింది. గురువారం రామ్ చరణ్ బర్త్ డేను పురస్కరించుకొని చిత్ర బృందం మూవీ టైటిల్ అలాగే సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది. సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్‌ను పెట్టగా పోస్టర్‌లో లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో ఉన్న చరణ్ సరికొత్త లుక్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.