ఢిల్లికి చెందిన మోహన్ అనే వ్యక్తి వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకున్నాడు. కాలాంశనగర్‌లో నివాసముంటున్న మోహన్ 2014లో సంతోష్ జైన్ వద్ద రూ.50వేలు అప్పు తీసుకున్నాడు. ఎనిమిదేళ్లుగా దానికి వడ్డీ కడుతున్నాడు. అయితే ఇంకా రూ.10లక్షలు చెల్లించాలని సంతోష్ జైన్ వేధించడంతో చివరికి ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు.చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసుకొని చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.