ఉపాధి హామీ కూలీలకు 2025-26 సంవత్సరంలో అత్యధిక పనిదినాలు కల్పించేందుకు పకడ్బందీగా ప్రణాళికలు చేసుకోవాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా పరిషత్, మండల అభివృద్ధి అధికారులు, ఎపీఒలతో సమావేశం నిర్వహించారు.