వనపర్తి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనంలో డా. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి పూలమాల వేసి గురువారం నివాళులర్పించారు. అనంతరం 52 మంది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను జూపల్లి, చిన్నారెడ్డి, కలెక్టర్ సన్మానించి మెమోంటోలు అందజేశారు. అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, నగేష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.