స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా సోమవారం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడిఓసి సమావేశ మందిరంలోని ప్రజావాణి హాల్ లో జిల్లా అదనపు కలెక్టర్ సంచిత గ్యాంగ్‌వార్ అధికారులతో కలిసి స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు తమ చుట్టు పక్కల పరిసరాల పరిశుభ్రతను తమ జీవన విధానంలో అలవాటుగా చేసుకోవాలన్నారు.