ఉపాధ్యాయులు సమాజాన్ని సంస్కరించే వ్యక్తులు అని మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ.. మనిషి తనకు తాను సంస్కరించుకొని సమాజ పురోభివృద్ధికి పాటుపడే విధంగా వ్యక్తులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని అన్నారు. విద్యార్థులలో నిత్యం ప్రేరణకలిగిస్తూ, వారి తల్లిదండ్రులలోనూ పరోక్షంగా ప్రేరణ కల్పించే విధంగా ఉపాధ్యాయుల బోధన ఉండాలని సూచించారు.