వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో విద్య, గ్రామీణాభివృద్ధి, ఇంజనీరింగ్ శాఖాధికారులతో బుధవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు ఇవ్వాల్సిన రెండవ జత ఏకరూప దుస్తులు, అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు రెండవ జత ఏకరూప దుస్తులను త్వరగా పంపిణీ చేయాలని ఆదేశించారు.