వనపర్తి జిల్లా రేవల్లి మండలానికి చెందిన 100 మందికి పైగా బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సమక్షంలో జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.