వనపర్తి జిల్లా ఖిల్లా ఘణపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అమ్మవారికి గురువారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామ గ్రామాన దుర్గామాత మండపాలు వెలిశాయని గ్రామీణ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తున్నారని అన్నారు. పూజల వలన గ్రామస్తుల మధ్యన ఐక్యత నెలకోవడంతో పాటు భక్తి భావం పెంపొందుతుందన్నారు.