వనపర్తి నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను పెద్ద జీతగాడిలా అహర్నిశలు పనిచేసి నియోజకవర్గ అభివృద్ధిలో మార్పును చూపిస్తానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో 473 మంది లబ్ధిదారులకు రూ. 1, 12, 47, 500 విలువ గల సిఎంఆర్ఎఫ్ చెక్కులను, 215 మంది లబ్ధిదారులకు 2, 15, 24, 940 విలువగల కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను అందజేశారు.