టీమిండియా కోచ్‌గా గౌతమ్ గంభీర్ తొలి సిరీస్‌ను విజయవంతంగా ముగించాడు. అయితే, ఈ సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన గంభీర్ సెలబ్రేషన్స్‌లో ట్రోఫీని అందుకోవడానికి ఇష్టపడలేదు. రింకూ సింగ్ ఎంత బతిమిలాడినా అంగీకరించలేదు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కోచ్‌గా ట్రోఫీని అందుకోవాలని రింకూ, రియాన్ పరాగ్ రిక్వెస్ట్ చేశారు. దానికి గంభీర్ నో చెప్పాడు. గ్రూప్‌లో చివర్లో ఉంటూ ఫొటోకు ఫోజులిచ్చాడు.