ఏపీలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. తిరుమల వైకుంఠ ద్వారా దర్శన టోకెన్లు జారీ నేపథ్యంలో భారీగా భక్తులు పోటెత్తారు. తిరుపతిలోని శ్రీనివాస నివాసం వద్ద భారీగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో తమిళనాడుకు చెందిన మహిళా భక్తురాలు మృతి చెందింది. మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి పోలీసులు తరలిస్తున్నారు. మొత్తం మూడు చోట్ల తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.