ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో దారుణం జరిగింది. పాతల్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతరను చూసేందుకు ఆదివారం 17 ఏళ్ల బాలిక వెళ్లింది. తిరిగి వస్తుండగా ఆమెను ఏడుగురు అడవిలోకి లాక్కెళ్లారు. సామూహిక అత్యాచారం చేశాడు. నిందితులలో ఒకరికి 18 ఏళ్లు కాగా, మిగిలిన వారంతా 16, 17 ఏళ్ల వయసు ఉన్న వారు. సోమవారం బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.