త్వరలో విజయవాడ నుంచి పుణే, అహ్మదాబాద్‌కు నేరుగా విమానాలు ప్రారంభించనున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు సర్వీసులు అందించనున్నట్లు వెల్లడించారు. అలాగే గన్నవరం ఎయిర్ పోర్ట్ మరో కొత్త టెర్మినల్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. అమరావతి నుంచి విజయవాడకు 13-14 నిమిషాల్లో చేరేలా రోడ్లు విస్తరిస్తున్నట్లు తెలిపారు.