AP: సావిత్రి బాయి పూలే 194వ జయంతి సందర్భంగా నేడు విజయవాడలో BCY పార్టీ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటి రేణు దేశాయ్ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. 'మహిళల విద్య కోసం సావిత్రబాయి పూలే ఎంతో కృషి చేశారు. నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను. సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం అని చెబితే వచ్చాను' అని ఆమె అన్నారు.