దేశంలో క్యాన్సర్ కేసుల నివారణలో భాగంగా మరో ఐదారు నెలల్లో మహిళలకు క్యాన్సర్ వ్యాక్సిన్‌ను ప్రారంభించనున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. కొత్త వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్‌తో పాటు రొమ్ము, నోటి క్యాన్సర్‌లను లక్ష్యంగా చేసుకుంటుందని వెల్లడించింది. 9 నుంచి 16ఏళ్ల మధ్య వయసుగల బాలికలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. 30 ఏళ్లు పైబడిన మహిళలు స్క్రీనింగ్ చేయించుకునేందుకు డేకేర్ క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.