కేటీఆర్‌పై కేసు నమోదుకు గవర్నర్‌ అనుమతి?

57చూసినవారు
కేటీఆర్‌పై కేసు నమోదుకు గవర్నర్‌ అనుమతి?
TG: ఫార్ములా-ఈ కార్‌ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై FIR నమోదు చేసేందుకు గవర్నర్‌ ఆమోదం లభించినట్లు సమాచారం. సంబంధిత ఫైల్ రెండు రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో జరిగిన కార్‌ రేసుకు సంబంధించి ఉల్లంఘనలు జరిగాయని ఏసీబీకి ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో కేటీఆర్‌పై కేసు నమోదుకు ప్రభుత్వం గవర్నర్‌ అనుమతి కోరింది. తాజాగా గవర్నర్‌ ఆమోదంతో కొత్త మలుపు తిరిగే అవకాశముంది.

సంబంధిత పోస్ట్