AP: 69 ఏళ్ళ వయసులో ఇందిర అనే వృద్ధ మహిళ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఇందిర విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో నివాసం ఉంటున్నారు. ఇందిరకు ముగ్గురు కొడుకులు. అయితే భర్త, బంధువులతో ఇక్కడే ఉంటున్నారు. ముగ్గురు కొడుకులు వివిధ ఉద్యోగాల్లో విదేశాల్లో.. అలాగే పక్క రాష్ట్రాల్లో ఉన్నారు. ఇక సంసార బంధాలన్నీ తీరిపోవడంతో ఆవిడ ఎప్పుడో 1970లో ఆగిపోయిన చదువుని మళ్లీ కొనసాగించాలని అనుకుని తాజాగా డిగ్రీ పట్టా సాధించారు.