TG రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌కోకు తీపికబురు చెప్పింది. విద్యుత్ సబ్సిడీ నిధులను మంజూరు చేసింది. రూ. 4,791 కోట్ల సబ్సిడీ నిధులను తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది. 2024 నవంబర్ నుంచి 2025 మార్చి వరకు సబ్సిడీ నిధులు రిలీజ్ చేస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.