ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన(AB-PMJAY)కు భారత్‌లో నివాసం ఉంటున్న 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరూ అర్హులే. ఇప్పటికే ఈ పథకం పరిధిలో ఉన్న వృద్ధులకు ఇప్పుడు రూ.5 లక్షల అదనపు కవరేజీ లభిస్తుంది. కుటుంబంలో ఇద్దరుంటే తలా రూ.2.50 లక్షల వైద్య సాయం పొందొచ్చు. ఇందులో మూడు రోజులపాటు ఉచితంగా ఆసుపత్రుల్లో చేర్చుకోవడం, వైద్య
పరీక్షలు తదితర సేవలు పొందొచ్చు. మందులు, వసతి, పోషకాహారం వంటి సేవలు లభిస్తాయి.