భారత్‌లో యాపిల్ ఐఫోన్ల విక్రయాలు జోరందుకున్నాయి. సెప్టెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీకి ఐఫోన్ విక్రయాల ద్వారా భారత్ నుంచి వస్తోన్న ఆదాయం గరిష్ఠ స్థాయికి చేరింది. దీంతో దేశవ్యాప్తంగా ఐఫోన్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని త్వరలోనే మరో నాలుగు స్టోర్లను ప్రారంభించనున్నట్లు తాజాగా యాపిల్ సీఈవో టిమ్ కుక్ ప్రకటించారు.