మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు.. భారత్కు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రెండు దేశాల మధ్య దౌత్య వివాదం నెలకొన్నవేళ ఇది జరగడం గమనార్హం. ‘‘రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీకి వేర్వేరుగా అధ్యక్షుడు సందేశాలు పంపారు. రానున్నకాలంలో భారత ప్రజలు శాంతి, అభివృద్ధి, సంపదతో తులతూగాలని ఆకాంక్షించారు. ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహాన్ని, బంధాన్ని గుర్తుచేసుకొన్నార’’ని అధ్యక్ష కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.