అర కోటి ఇళ్లలో 'గృహజ్యోతి’

59చూసినవారు
అర కోటి ఇళ్లలో 'గృహజ్యోతి’
TG: రాష్ట్రంలో గృహజ్యోతి పథకం కింద లబ్ధి పొందుతున్న ఇళ్ల సంఖ్య తొలిసారి జనవరిలో అర కోటి దాటింది. గత నెలలో రాష్ట్రంలోని 50.16లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్ ను సరఫరా చేశారు. ఈ పథకంలో భాగంగా 200యూనిట్లలోపు విద్యుత్ ను వాడుతున్న పేదలకు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. పథకం ప్రారంభించిన 2024 మే నెలలో 42.51లక్షల ఇళ్లలో 227.40మిలియన్ యూనిట్ల(మి.యూ.) కరెంటు వినియోగమైంది.

సంబంధిత పోస్ట్