వేరుశనగ అత్యంత ముఖ్యమైన నూనె విత్తన పంటలలో ఒకటి. ఈ పంటను ప్రధానంగా ఖరీఫ్, రబీ, యాసంగి, వానాకాలం సీజన్లలో సాగు చేయాలి. బంకమట్టి నేలలు ఈ పంటకు అనుకూలం కాదు. pH అవసరం- 6.0 - 7.5 ఉండాలి. 600 - 1500 మి.మీ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో పంట సాగు చేయడం ఉత్తమం. 12-18 సెం.మీ లోతు వరకు ,మట్టిని తిప్పి, రెండు సార్లు నేల మొత్తాన్ని దున్నడం మంచిది. విత్తిన 3-4 వారాలకు మొదటి కలుపు తీయాలి. 10-15 రోజుల వ్యవధిలో పంటకు నీరు అందించాలి.