వేరుశనగ పంటను నూనె పంటలలో ప్రధాన పంటగా చెప్పుకోవచ్చు. వేరుశనగను యాసంగిలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు. ఈ పంట సాగుకు తేలికపాటి నేలలు, నల్లరేగడి నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి. వ్యవసాయం చేసే రైతులు సాగు ప్రారంభానికి ముందే ఆ పంటకు సంబంధించిన అన్ని విషయాలపై ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండాలి. సాగు ప్రారంభంలో ఏవైనా పొరపాట్లు జరిగితే తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సిందే.