విజయ్ మాల్యా, నీరవ్‌ మోదీలను అప్పగించండి: ప్రధాని మోదీ

66చూసినవారు
విజయ్ మాల్యా, నీరవ్‌ మోదీలను అప్పగించండి: ప్రధాని మోదీ
భారత్‌ నుంచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్‌ మోదీని అప్పగించాలని ప్రధాని మోదీ.. బ్రిటన్ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ను కోరారు. బ్రెజిల్‌లో జీ20 దేశాల సదస్సుకు వెళ్లిన ఆయన బ్రిటన్‌ ప్రధానికి ఈ అంశంపై విజ్ఞప్తి చేశారు. భారత్‌లో రూ.9 వేల కోట్ల వరకు బ్యాంకు రుణాలను ఎగవేసిన మాల్యా 2016లో లండన్‌కు పారిపోయాడు. ఆ తర్వాత పంజాబ్ నేషనల్‌ బ్యాంకుకు నీరవ్‌ మోదీ దాదాపు రూ.14 వేల కోట్ల రుణం ఎగవేసిన వ్యవహారం 2018లో బయటపడింది.

సంబంధిత పోస్ట్